
లండన్: వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 4–6, 7–6 (7/2), 6–2తో ఫ్రాన్సెస్ తియెఫో (అమెరికా)పై ఐదు సెట్ల పాటు కష్టపడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–1, 6–4తో గిరన్ (అమెరికా)ను చిత్తు చేయగా, పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–3తో మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
విమెన్స్ సింగిల్స్‌లో రెండో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) 6–4, 6–0తో కర్టల్ (ఇంగ్లండ్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్ చేరింది. ఏడో సీడ్ జాస్మిన్ (ఇటలీ), 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) కూడా ముందంజ వేశారు. కాగా, మెన్స్ డబుల్స్‌లో ఇండియా స్టార్ యూకీ భాంబ్రీ–ఒలీవిటి (ఫ్రాన్స్) రెండో రౌండ్‌లో 6–4, 4–6, 3–6తో క్రావిట్జ్–టిమ్ పుట్జ్ (జర్మనీ) చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు.