సల్మాన్ సినిమాకు బ్రేక్ పడింది

సల్మాన్ సినిమాకు బ్రేక్ పడింది

విజయాలు, కలెక్షన్ల పరంగా అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడేమో కానీ…  ప్రస్తుతం బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ని శాసించేది ఎవరు అంటే మాత్రం కచ్చితంగా సల్మాన్ ఖాన్ అని చెప్పొచ్చు. బడా ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి చిన్న చిన్న ఫిల్మ్ మేకర్స్‌ వరకూ అందరూ అతని కనుసన్నల్లో మెలుగుతూ ఉంటారు. అలాంటివాడి సినిమా ఆగిపోయిందంటే ఆశ్చర్యం వేయక మానదు. కానీ అదే జరిగింది. ‘ఇన్షా అల్లాహ్’ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్‌‌‌‌‌‌‌‌లే సోషల్ మీడియాలో ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఈ మూవీని అనౌన్స్ చేశారు. సల్మాన్ సరసన ఆలియా హీరోయిన్‌‌‌‌‌‌‌‌ అని కూడా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని సల్మాన్, ఆలియా, భన్సాలీ చెప్పారు. ‘దబంగ్ 3’ పూర్తయ్యాక సెట్స్‌‌‌‌‌‌‌‌ మీదికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అంతలో ఏమైందో ఏమో… ప్రాజెక్టును నిలిపివేశారు. ప్రస్తుతానికి నిలిపివేశాం అని భన్సాలీ చెప్పినప్పటికీ.. ఇది ఎప్పటికీ పట్టాలెక్కకపోవచ్చు అనే టాక్ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో నడుస్తోంది. కారణం.. సల్మాన్, భన్సాలీ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో సినిమా అంటే భారీగా ఉంటుంది. అలాంటి దాన్ని ఆపాల్సి వచ్చిందంటే కారణం పెద్దదే అయ్యుండొచ్చు. కాబట్టి మళ్లీ మొదలు పెట్టడమనేది అనుమానమే. అయితే సల్మాన్ దీన్ని పెద్ద సీరియస్​గా తీసుకోకుండా తన పనిలో తాను పడిపోయాడు. ‘పహిల్వాన్‌‌‌‌‌‌‌‌’ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసి సుదీప్‌‌‌‌‌‌‌‌ని  ప్రత్యేకంగా అభినందించాడు.   ‘దబంగ్ 3’తో త్వరలో వస్తానన్నాడు.