షాకింగ్: ఢిల్లీలో రూ.4 కోట్లు కొట్టేశారు.. పాలస్తీనా హమాస్ అకౌంట్లో పడ్డాయి..

షాకింగ్: ఢిల్లీలో రూ.4 కోట్లు కొట్టేశారు.. పాలస్తీనా హమాస్ అకౌంట్లో పడ్డాయి..

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులతోపాటు, సైనికులు చనిపోయారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాదులపై విరుచుకుపడుతోంది. ఇవాళ (అక్టోబర్ 11) గాజా పట్టణాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకుంది ఇజ్రాయెల్ సైన్యం.. ఈ నేపథ్యంలో ఢిల్లీలో క్రిప్టో కరెన్స్ దొంగించిన కేసులో  విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలకు షాకింగ్ విషయాలు తెలిశాయి. పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ కు చెందిన అల్ కస్సామ్ బ్రిగేడ్ లచే నిర్వహించబడుతోన్న కొన్ని అనుమానిత వాలెట్ లకు ఈ క్రిప్టో కరెన్సీ బదిలీ అయినట్లు గుర్తించారు. 

2019లో ఓ వ్యాపార వేత్త ఖాతా నుంచి క్రిప్టో కరెన్సీ దొంగించబడినట్టు మొదటి సారి ఢిల్లీ పశ్చిమ విహార్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తును యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ కు అప్పగించారు. 2021లో ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆఫ్ యూనిట్ విచారణ చేపట్టింది. 

హమాస్ తో లింక్ ఎలా అంటే 

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజేన్సీ మొస్సాద్ ఇచ్చిన సమాచారం మేరకు హమాస్ ఉగ్రవాదులకు ఈ కేసుకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ బదిలీ అయిన ఖాతాల  ఐడీలను గుర్తించినా ఖాతాల వినియోగదారులను గుర్తించ లేకపోయింది.  ఆ సమయంలో హమాస్ ఉగ్రవాద సంస్థ తమ భారత్ లోని సహచరులకోసం నిర్వహిస్తున్న అనుమానిత వాలెట్ల సమాచారాన్ని అందించడంతో IFSO వాలెట్‌లపై పోల్చి చూడగా.. ఢిల్లీ కేసులో భాగమైన అనేక వాలెట్‌లను హమాస్‌కు చెందిన సైబర్ ఉగ్రవాద విభాగం నడుపుతున్నట్లు వారు కనుగొన్నారు.

ఈ జాబితాలో ఉన్న చాలా వాలెట్లను ఇజ్రాయెల్ నేషనల్ బ్యూరో కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం స్వాధీనం చేసుకుంది. ఈ వాలెట్లలో ఒకటి పాలస్తీనాలోని రమల్లాలో అహ్మద్ క్యూహెచ్ సఫీ, గిజాలోని అహ్మద్ మర్జూక్, గాజాలోని నాజర్ ఇబ్రహీం అబ్దుల్లా వంటి హమాస్ కార్యకర్తలకు చెందినదని గుర్తించారు. 

Also Read : ఎలా సంపాదిస్తున్నార్రా : గుట్టలుగా డబ్బులు, 100 ఫేక్ నెంబర్ ప్లేట్స్

మరోవైపు హమాస్ ఉగ్రవాదుల కట్టడిలో భాగంగా ఇజ్రాయెల్ చర్యలు ముమ్మరం చేసింది. ఉగ్రవాద ముఠాలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ ఖాతాలను స్తంభింపచేసింది.