నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చింది: రిజ్వీ

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసొచ్చింది: రిజ్వీ

లక్నో: లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం తనకు కలిసొచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వీ అన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం చాలా సంతోషాన్నిచ్చిందన్నాడు. రాబోయే రోజుల్లోనూ ఇదే నిలకడను కొనసాగిస్తానని చెప్పాడు. ‘నేను యూపీ తరఫున కూడా నాలుగో స్థానంలోనే ఆడాను.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అదే ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రావడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సహజ సిద్ధమైన ఆట ఆడాలని కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నా’ అని రిజ్వీ పేర్కొన్నాడు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వికెట్లు పడటం,టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దది కాకపోవడంతో పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరును అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లామన్నాడు. ‘బంతి స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుండటంతో పేసర్లను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. అందుకే స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీగా రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశాం. సొంత గడ్డపై ఆడుతుండటం, ఇక్కడి పరిస్థితులు, బౌండరీ పరిమాణంపై అవగాహన ఉండటం నాకు ఎంతో మేలు చేసింది’ అని రిజ్వీ వివరించాడు. 

మరిన్ని వార్తలు