DC vs RR: ఐపీఎల్ 2026 లీగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో టోర్నమెంట్ మరింత రసవత్తరంగా మారింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR)కు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బిగ్ షాక్ ఇచ్చింది. రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఓపెనర్ల ‘సెంచరీ’ సునామీ:
194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. పవర్‌ప్లేను పూర్తిగా వాడుకున్నారు. ఇద్దరూ పోటీ పడి మరీ హాఫ్ సెంచరీలు బాదారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య నమోదైన సెంచరీ భాగస్వామ్యానికి బ్రిజేష్ శర్మ బ్రేక్ వేశాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన పోరెల్‌ను బ్రిజేష్ అవుట్ చేశాడు.
మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ కంబ్యాక్:
పోరెల్ అవుటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ కాస్త తడబడింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాహిల్ పరాఖ్ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన పదునైన బంతికి కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరోవైపు బాధ్యతాయుతంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 56 పరుగులు - 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టు స్కోరు 133 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దాసున్ షనక వేసిన అద్భుత డెలివరీకి రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (4) కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది.
కెప్టెన్ అక్షర్ ఫినిషింగ్ టచ్:
చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా మారిన వేళ క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఒక భారీ సిక్సర్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్లే కనిపించినా.. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కానీ ఆ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్, యంగ్ సెన్సేషన్ అశుతోష్ శర్మతో కలిసి నెమ్మదిగా ఒత్తిడిని అధిగమించారు. ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో మ్యాచ్‌ను ఆఖరి ఓవర్లో మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చారు.
