ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఢిల్లీ పిచ్‌పై చేజింగ్ టీమ్‌కు రాత్రి వేళ మంచు (Dew) కలిసివస్తుందనే నమ్మకంతో కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. మ్యాచ్‌లు గెలుస్తుంటే జట్టులో పాజిటివ్ వైబ్స్‌తో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.. పిచ్ ఎలా ప్రవర్తించినా సరే, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం.. ఈ మ్యాచ్ ద్వారా మా జట్టు తరఫున త్రిపురాన విజయ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే పిచ్ విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నాను.. ఈ గ్రౌండ్‌లో చేజింగ్ చేయడం కొంచెం సులువు కాబట్టి.. ఒక రకంగా మేము టాస్ ఓడిపోవడం మంచిదే అయింది.. మా గత కొన్ని మ్యాచ్‌లలో విజయాలు, ఓటములతో అప్ అండ్ డౌన్స్ చూశాం.. జట్టులో చిన్న చిన్న గాయాల సమస్యలు కూడా ఉన్నాయి.. ఈ రోజు మ్యాచ్‌లో మేం ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం.. రవీంద్ర జడేజా (Jaddu) ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ రవి సింగ్ ఐపీఎల్ డెబ్యూ చేస్తున్నాడని పేర్కొన్నాడు.
ఇరు జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), రవి సింగ్, డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్
