ఢిల్లీ గ్రేట్ విక్టరీ : పోరాడి ఓడిన కోహ్లీసేన

ఢిల్లీ గ్రేట్ విక్టరీ : పోరాడి ఓడిన కోహ్లీసేన

ఢిల్లీ : ఢిల్లీ మరోసారి సత్తాచాటింది. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 16 రన్స్ తేడాతో గెలిచింది ఢిల్లీ.  టాసె గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యార్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ (52), ఓపెనర్ శిఖర్ ధావన్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్(7) మరోసారి నిరాశపరిచాడు.

ఢిల్లీ ప్లేయర్లలో.. పృద్వీషా(18), ధావన్(50), శ్రేయాస్(52), రిషబ్ పంత్(7), కొలిన్ ఇన్ గ్రామ్(11), రుథర్ ఫోర్డ్(), అక్షర్ పటేల్() రన్స్ చేశారు.

బెంగళూరు బౌలర్లలో..చాహల్(2), ఉమేష్ యాద్(1), వాషింగ్టన్ సుందర్(1), సైనీ(1) వికెట్లు తీశారు.

188 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే రబడా వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి పార్థీవ్ పటేల్(39) అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్సర్ పటేల్ వేసిన 8వ ఓవర్ రెండో బాల్ కి  కోహ్లీ(23) రూతర్‌ ఫర్డ్‌ కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు.

ఈ దశలో డివిలియర్స్, దూబేల జోడీ జట్టుకు అండగా నిలిచింది. అయితే రూతర్‌ ఫోర్డ్ వేసిన 12వ ఓవర్ మూడో బాల్ కి డివిలియర్స్(17) అక్సర్ పటేల్‌ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే క్లాసెన్(3) చెత్త షాట్‌ కు ప్రయత్నించి.. పంత్‌ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో గుర్‌ కీరత్, స్టోనిస్ టీమ్ ను గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం మాత్రం ఢిల్లీకి అనుకూలించింది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 171 రన్స్ మాత్రమే చేయండంతో.. ఢిల్లీ ఈ మ్యాచ్‌ లో 16 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫ్లేఆఫ్స్‌ కు చేరుకుంది.