ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం: కేజ్రీవాల్

ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం: కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్‌షాతో కలవడం ఇదే తొలిసారి. అయితే ఈ భేటీలో వారిద్దరూ ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధికై పలు అంశాల గురించి చర్చించారు.

అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిశానని, ఈ భేటిలో ఢిల్లీకి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించామని, రాష్ట్రాభివృద్ధికై ఇద్దరూ కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని కేజ్రీవాల్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.