ఈడీ విచారణకు హాజరుకావట్లె.. గోవాకు పోతున్న కేజ్రీవాల్..

ఈడీ విచారణకు హాజరుకావట్లె.. గోవాకు పోతున్న కేజ్రీవాల్..

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరు కానున్నారు. మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి జనవరి 19 (శుక్రవారం)న అర్వింద్ కేజ్రివాల్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు నాలుగోసారి సమన్లు జారీ చేశారు. కానీ అర్వింద్ కేజ్రీవాల్ ఆ రోజు గోవాలో పర్యటించనున్నారు. 

జనవరి 18 నుంచి 3 రోజుల పాటు కేజ్రీవాల్  గోవాలో పర్యటించనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా అధ్యక్షుడు అమిత్ పలేకర్ తెలిపారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రానున్నట్టు చెప్పారు. దీంతో అర్వింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాకపోవడం ఇది నాలుగోవ సారి అవుతుంది. 

ఇది వరకే విచారణకు హాజరుకావాలని ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ఒక్కదానికి కూడా హజరుకాలేదు. ఇప్పుడు నాలుగోసారి కూడా అర్వింద్ కేజ్రీవాల్ గైర్హజరవుతుండటంతో ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.