నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి: కేజ్రీవాల్

నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి: కేజ్రీవాల్

హిట్ అండ్ రన్ ఘటన హేయమైనదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కారుతో యువతిని ఢీకొట్టి  కిలో మీటర్ల దూరం లాక్కెళ్లడం దారుణమన్నారు. ఇది దురదృష్టకరమైన ఘటన అన్నారు. నిందితులు ఎంత పెద్దవారైనా కఠిన శిక్ష పడేలా చూడాలని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీలో నిన్న ఉదయం స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టింది. అంతేకాకుండా యువతిని కారు 4 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీని అట్టుడికిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు.. యువతి కుటుంబసభ్యులు.. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు పెద్దఎత్తున ఆందోళన చేశారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు..ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ ప్రొటెస్ట్ తో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేందుకు యత్నించారు.