కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రం తీరుపై చర్చ

కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రం తీరుపై చర్చ

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్. అనంతరం కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై చర్చించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ముగ్గురు సీఎంలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మే 27వ తేదీ శనివారం కేజ్రీవాల్ హైదరాబాద్ కు చేరుకుని కేసీఆర్ తో సమావేశమైయ్యారు. 

ఇక ఇటీవలే ఢిల్లీకి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే... మరోవైపు విపక్షాల మద్దతును కూడగడుతున్నారు.ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో భేటీ అయిన ఆయన.. శనివారం తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైయ్యారు. ఆర్డినెన్స్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కోరనున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఆప్ గట్టిగా పోరాడుతోంది. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడుతున్నారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక‌రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలతో భేటీ అయ్యారు.