ఢిల్లీ మార్కెట్‌ ప్రాంతాల్లో కేంద్రం లాక్‌డౌన్‌కు అనుమతించాలి: కేజ్రీవాల్

ఢిల్లీ మార్కెట్‌ ప్రాంతాల్లో కేంద్రం లాక్‌డౌన్‌కు అనుమతించాలి: కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అక్కడి మార్కెట్‌ ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌కు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదన పంపనున్నారు. నిబంధనలు పాటించని ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా మార్చి కొన్నిరోజుల పాటు వాటిని మూసేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని కేజ్రీవాల్‌ తెలిపారు. 750 ICU పడకలు పెంచినందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటకీ ప్రజలు నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. మాస్కులు దరించడం, భౌతిక దూరం పాటించడమే ప్రస్తుత లక్ష్యాలన్నారు. అలాగే వివాహ వేడుకలకు 50 మందిని మాత్రమే అనుమతించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు తమ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని చెప్పారు కేజ్రీవాల్‌.