మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట

 మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ లో జైలు శిక్ష  అనుభవిస్తున్న  ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది.  అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతించింది.  కోర్టు ఆదేశం మేరకు   మనీష్ సిసోడియా డాక్టర్ సమక్షంలో  ఆమెను పరామర్శిస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. 

 

అంతకుముందు గతేడాది నవంబర్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలవడానికి సిసోడియాకి  కోర్టు తెలిపింది.  మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతున్నారు సీమా. మెదడు, వెన్నుముకపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఆమెను  కలిసేందుకు జూన్‌లో కూడా సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.  కాగా 2023 ఫిబ్రవరి 26న   మనీలాండరింగ్ కేసులో సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా ఆరోగ్యం క్షీణించింది