కవితకు ఇంటి భోజనం, పెన్నులు, పేపర్లు

కవితకు ఇంటి భోజనం, పెన్నులు, పేపర్లు

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా ఆమెను జైలుకు తరలించారు ఈడీ అధికారులు. కవితకు ఇంటిభోజనంతో పాటు.. మెడిసిన్స్, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్ షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితను విచారించనున్నారు. 9న ఉదయం 11గంటలకు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు.

పదిరోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను  హాజరుపర్చారు ఈడీ అధికారులు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. అందుకు కోర్టు అనుమతించడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు.

మరోవైపు ఢిల్లీ ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు ఏప్రిల్ 1 వరకు పరీక్షలు ఉన్నాయని.. కాబట్టి అప్పటివరకు ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు బెయిల్ విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

  • Beta
Beta feature