ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు 

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు 

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురుని ప్రశ్నించిన అధికారులు తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీసులు పంపారు. సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. సోసిడియాతో పాటు స్కాంతో సంబంధముందని భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను కూడా సీబీఐ అధికారులు రేపు ప్రశ్నించనున్నారు. 

సీబీఐ నోటీసులపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మా ఇంట్లో 14గంటలు సోదాలు నిర్వహించారు. నా బ్యాంక్ లాకర్ తనిఖీ చేశారు. నా సొంత ఊరిలోనూ సోదాలు చేశారు. సీబీఐకి ఎక్కడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు సోమవారం ఉ.11గంటలకు సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో విచారణకురావాలని పిలిచారు. విచారణకు పూర్తిగా సహకరిస్తా. సత్యమేవ జయతే" అని ట్వీట్ చేశారు.