
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారం చేపడుతుందని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ ను ఊడ్చేశారన్నారు. జైలు పార్టీలు.. అవినీతి కుంభకోణాల పార్టీ మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారన్నారు. ఢిల్లీలో కాషాయ జండాను ఎగురవేస్తామని ముందే ఊహించామన్నారు.
ఇక తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బంబిసంజయ్ అన్నారు, రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాద్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో మీ సమస్యల గురించి ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అని మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ALSO READ | అళగేశన్పై జీఆర్ఎంబీ ఉద్యోగుల ఫిర్యాదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఢిల్లీపీఠం కైవసం చేసుకునే దిశగా బీజేపీ సత్తా చాటుతోంది. 40 స్థానాల్లో లీడ్ సాధించింది. ఆప్ 30 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక హస్తం పార్టీ కనీసం పోటీలో లేకుండా పోయింది.