మీరు దేవుళ్లు : సిటీలో వర్షం కురిపిస్తాం.. పర్మిషన్ ఇవ్వండి..

మీరు దేవుళ్లు : సిటీలో వర్షం కురిపిస్తాం.. పర్మిషన్ ఇవ్వండి..

ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఆందోళన గురి చేస్తున్న క్రమంలో కాలుష్య నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించే అవకాశాలపై  దృష్టి సారించింది. ఇదే విషయమై శుక్రవారం ( నవంబర్ 10) సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది. 

క్లౌడ్ సీడింగ్ కోసం ఢిల్లీ ప్రభుత్వమే  ఖర్చు భరిస్తుందని.. కేంద్రం మద్దతిస్తే నవంబర్ 20 నాటికి ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించవచ్చని కేజ్రీ వాల్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఐఐటీ కాన్ఫూర్  కు చెందిన బృందంతో సమావేశమైంది. నగరంలో కృత్రిమ వర్షం కురిపించే అవకాశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. నవంబర్ 20 నుంచి 21 తేదీల్లో ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటే కృత్రి మ వర్షం కురిపించవచ్చని తెలిపారు.