న్యూఢిల్లీ: మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం అటల్ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించింది. ఢిల్లీ వ్యాప్తంగా 100 క్యాంటీన్ల ఏర్పాటులో భాగంగా గురువారం 45 క్యాంటీన్లను సీఎం రేఖా గుప్తా ఓపెన్ చేశారు.
రాబోయే రోజుల్లో ఇంకో 55 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. కార్మికులు, పేదలకు ఉపయోగపడేలా ప్రభుత్వం క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 5 రూపాయలకే భోజనం లభించనుంది.
