ఆపరేషన్ సైబర్ హాక్.. 48 గంటల్లో వెయ్యికోట్ల ఆన్ లైన్ మోసాలకు చెక్..ఢిల్లీలో 700 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

ఆపరేషన్ సైబర్ హాక్.. 48 గంటల్లో వెయ్యికోట్ల ఆన్ లైన్ మోసాలకు చెక్..ఢిల్లీలో 700 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

ఆపరేషన్​ సైబర్​ హాక్​ పేరుతో భారీ ఎత్తున దాడులు నిర్వహించారు ఢిల్లీ పోలీసులు. ఆపరేషన్​ లో భాగంగా 700 మందికిపైగా సైబర్​ నేరగాళ్లను అరెస్ట్​ చేశారు.దాదాపు వెయ్యి కోట్లు విలువైన సైబర్​ మోసాలను బయటపెట్టారు. ఈ సైబర్​ క్రైం ఆపరేషన్ ను ఢిల్లీ పోలీసులు, జిల్లా పోలీసులు, IFSO యూనిట్లు సంయుక్తంగా నిర్వహించాయి. 

దాదాపు 48 గంటల పాటు ఢిల్లీ పోలీసులు అపరేషన్​ సైబర్​ హాక్​ పేరుతో ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో జిల్లీఆ పోలీసులు , ఇంటెలిజెన్స్​ ఫ్యూజన్​ అండ్​ స్ట్రాటజిక్​ ఆపరేషన్స్​ యూనిట్​ సంయుక్తంగా పాల్గొన్నాయి.  వెయ్యి కోట్ల విలువైన సైబర్​ఫ్రాడ్స్​ ను బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. 

సైబర్​ ఫ్రాడ్​ నెట్ వర్క్​ లను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్​, నకిలీ కస్టర్​ కేర్​మోసాలు, ఇన్వెస్ట్​ మెంట్ ఫ్రాడ్స్​, ఆన్​ లైన్​ పేమెంట్స్​ వంటి సైబర్ మోసాలను బయటపెట్టినట్లు తెలిపారు. ఢిల్లీ సమీప జిల్లాల్లో సైబర్ నేరస్తులు పెద్ద ఎత్తున ఉన్నారని అధికారులు తెలిపారు.