డేంజర్ జోన్ లో ఢిల్లీ.. రెండు రోజులు స్కూళ్లు బంద్

డేంజర్ జోన్ లో ఢిల్లీ.. రెండు రోజులు స్కూళ్లు బంద్

పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 2న రాత్రి ప్రకటించారు. జాతీయ రాజధానిలో కాలుష్య స్థాయిలు ఈ సీజన్‌లో మొదటిసారిగా తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశించాయి. దీంతో రాబోయే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

'ఎక్స్'లో పోస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్.. "పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు రాబోయే 2 రోజుల పాటు మూసివేయబడతాయి" అని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా, నవంబర్ 3, 4 తేదీల్లో అన్ని MCD, MCD-సహాయక పాఠశాలల్లో ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, పాఠశాలలు ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం మాత్రం పాఠశాలలు తెరిచే ఉంటాయని" అధికారులు వెల్లడించారు.

Also Read :- ఈ నగరానికి ఏమైంది..?

AQI 400 మార్కును అధిగమించిన ప్రాంతాలు - ఆనంద్ విహార్ (450), బవానా (452), బురారీ క్రాసింగ్ (408), ద్వారకా సెక్టార్ 8 (445), జహంగీర్‌పురి (433), ముండ్కా (460), NSIT ద్వారక (406) , నజాఫ్‌గఢ్ (414), నరేలా (433), నెహ్రూ నగర్ (400), న్యూ మోతీ బాగ్ (423), ఓఖ్లా ఫేజ్ 2 (415), పట్పర్‌గంజ్ (412), పంజాబీ బాగ్ (445), ఆర్‌కె పురం (417), రోహిణి ( 454), షాదీపూర్ (407) మరియు వజీర్‌పూర్ (435).