కప్పు కల నెరవేరేనా..? తొలి టైటిల్ వేటలో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌

కప్పు కల నెరవేరేనా..? తొలి టైటిల్ వేటలో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ క్యాపిటల్స్‌

ఐపీఎల్ చరిత్రలో ఆరంభం నుంచి పోరాడుతున్నా.. ఇప్పటివరకు టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిన జట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌, పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌. సీజన్లు మారినా, నాయకులు మారినా, ప్లేయర్లను మార్చినా, చివరకు పేర్లు మార్చుకున్నా ఈ రెండు జట్ల తలరాత మాత్రం మారలేదు. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణలో ఢిల్లీ ఒకసారి, పంజాబ్ రెండుసార్లు ఫైనల్ చేరినా గమ్యాన్ని ముద్దాడలేకపోయాయి. మరో మూడు రోజుల్లో 19వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈసారి ఎలాగైనా ‘చాంపియన్’ ముద్ర వేసుకోవాలని అటు అక్షర్ పటేల్, ఇటు శ్రేయస్ అయ్యర్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కింగ్స్‌‌‌‌‌‌‌‌కు కిరీటం దక్కేనా

మెగా లీగ్‌‌లో ఇది వరకు రెండుసార్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరినా టైటిల్‌‌‌‌‌‌‌‌ దక్కించుకోలేకపోయిన పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌-19 కోసం సరికొత్తగా సిద్ధమైంది. లెజెండరీ కోచ్‌‌‌‌‌‌‌‌ రికీ పాంటింగ్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌.. 2025లో తృటిలో మిస్సయిన మెగా కప్‌‌‌‌‌‌‌‌ను ఈసారి ఒడిసి పట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

ఓ దశలో పదేళ్ల పాటు ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ చేరలేకపోయిన టీమ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా ప్రక్షాళన చేసిన మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చి కెప్టెన్సీ అప్పగించి చేసిన ప్రయోగం గతేడాది  సూపర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. వచ్చీరాగానే అయ్యర్ జట్టును ఫైనల్ చేర్చాడు. ఆఖరాటలో బెంగళూరు చేతిలో ఓడినా  మెగా లీగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ ఒక్కసారిగా స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌గా మారింది. 

బలం..

పంజాబ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ లేనంత బలంగా మారింది. భారీ హిట్టర్లుగా పేరుగాంచిన గ్లెన్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌, జోస్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ను తప్పించి ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేశారు. వేలంలో బెన్‌‌‌‌‌‌‌‌ డ్వార్షుయిస్‌‌‌‌‌‌‌‌, కూపర్‌‌‌‌‌‌‌‌ కనోలి జట్టులోకి రాగా.. రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఎంట్రీ ఇచ్చాడు.  వీళ్ల రాకతో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌కు  చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. 

బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌ అత్యంత కీలకం కానున్నాడు. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో రాణించిన పేసర్‌‌‌‌‌‌‌‌ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం పంజాబ్‌‌‌‌‌‌‌‌కు కలిసొచ్చే అంశం. గతేడాది దంచికొట్టిన డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ స్టార్లు ప్రియాంశ్‌‌‌‌‌‌‌‌ ఆర్య, ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, నేహల్‌‌‌‌‌‌‌‌ వదేరాతో పాటు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు స్టోయినిస్‌‌‌‌‌‌‌‌, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌, మార్కో యాన్సెస్‌‌‌‌‌‌‌‌ కీలకం కానున్నారు. 

బలహీనతలు..

గతేడాది చివర్లో తీవ్రమైన గాయానికి గురైన శ్రేయస్‌‌‌‌‌‌‌‌ చాలా రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగినా పెద్దగా సక్సెస్‌‌‌‌‌‌‌‌ కాలేదు. తన ఫామ్‌‌‌‌‌‌‌‌పై కూడా సందేహాలు ఉన్నాయి. స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌లో సత్తా ఉన్నా నిలకడలేమి ప్రధాన సమస్య. స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ది కూడా సేమ్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌. 

లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ యాన్సెస్‌‌‌‌‌‌‌‌పై భారీ ఆశలు ఉన్నా వాటిని నెరవేర్చలేకపోతున్నాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరం కానున్న లోకీ ఫెర్గూసన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను ఎవరు భర్తీ చేస్తారన్నది అతిపెద్ద ప్రశ్న.  ఇక జట్టులో నాణ్యమైన స్పిన్నర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. చహల్, హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ మినహా పూర్తిస్థాయిలో 4 ఓవర్లు వేయగల స్పిన్నర్లు లేరు. 

పంజాబ్ జట్టు

శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ప్రియాంశ్ ఆర్యా, పైలా అవినాశ్‌‌‌‌‌‌‌‌, హర్నూర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, విష్ణు వినోద్‌‌‌‌‌‌‌‌, నేహల్‌‌‌‌‌‌‌‌ వదేరా, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌, కూపర్‌‌‌‌‌‌‌‌ కనోలి, మార్కో యాన్సెన్‌‌‌‌‌‌‌‌, ముషీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, మిచెల్ ఒవెన్‌‌‌‌‌‌‌‌, శశాంక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, మార్కస్‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌, సూర్యాన్ష్‌‌‌‌‌‌‌‌ షెడ్గే, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, జేవియర్‌‌‌‌‌‌‌‌ బార్ట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌, యజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ దూబే, బెన్‌‌‌‌‌‌‌‌ డ్వార్షుయిస్‌‌‌‌‌‌‌‌, లోకీ ఫెర్గుసన్‌‌‌‌‌‌‌‌, హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌, విశాల్‌‌‌‌‌‌‌‌ నిషాద్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వైశాక్‌‌‌‌‌‌‌‌, యష్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌. 

అక్షర్ ‘అస్త్రం’తో ఢిల్లీ గురి

గత సీజన్లలో స్టార్ ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ఢిల్లీ.. 2026 సీజన్ కోసం మాత్రం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆడంబరాల కంటే జట్టు అవసరాలకు తగ్గట్టుగా, ప్రతి విభాగంలోనూ సమతూకం ఉండేలా చూసుకుంది.  

బలాలు 

సీనియర్లు, యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల కలయికతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమతుల్యంగా ఉన్నాయి. ప్రతి ప్లేస్‌‌‌‌‌‌‌‌కు నాణ్యమైన బ్యాకప్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం జట్టుకు అతిపెద్ద బలం. దీనివల్ల పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థిని బట్టి ఫారిన్ ప్లేయర్ల  కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను మార్చుకునే వెసులుబాటు లభించింది. దాదాపు ప్రతి విభాగంలోనూ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు ఉండటం వల్ల టోర్నీ పొడవునా ప్రయోగాలు చేసే అవకాశం ఢిల్లీకి ఉంది. కెప్టెన్ అక్షర్ పటేల్ ప్రశాంతత, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ నైపుణ్యం జట్టుకు కొండంత అండగా నిలవనుంది.

బలహీనతలు 

స్థిరమైన ఓపెనింగ్ జోడీ లేకపోవడం ప్రధాన బలహీనత. బెన్ డకెట్ చివరి నిమిషంలో లీగ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకోవడం పెద్ద షాక్‌‌‌‌‌‌‌‌. నిశాంక, పృథ్వీ షా, కేఎల్ రాహుల్ వంటి ఆప్షన్లు ఉన్నా.. సరైన జోడీని ఎంచుకోవడంలో తడబడితే అది బ్యాటింగ్ రిథమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరోవైపు, కీలక సమయాల్లో ఒత్తిడికి లోనవ్వడం ఢిల్లీకి అలవాటు. 
గత సీజన్‌‌‌‌‌‌‌‌లోనూ డెత్ ఓవర్లలో భారీగా రన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదా బ్యాటింగ్ కుప్పకూలడం వల్ల గెలిచే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను చేజార్చుకుంది. ఫారిన్ ప్లేయర్లపై అతిగా ఆధారపడటం ఢిల్లీ మరో వీక్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌.  ఆసీస్‌‌‌‌‌‌‌‌ స్టార్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్ స్టార్క్ ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరం కాబోతుండటం కూడా ప్రతికూలాంశమే.  

ఢిల్లీ జట్టు:

అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, నితీష్ రాణా, పృథ్వీ షా, కరుణ్ నాయర్, పాథుమ్ నిశాంక, సమీర్ రిజ్వీ, ఆశుతోష్ శర్మ, సాహిల్ పరాఖ్. అభిషేక్ పోరెల్,అజయ్ మండల్, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, ఆకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముకేష్ కుమార్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, కైల్ జెమీసన్.