ఢిల్లీలో కరోనా విజృంభణ

ఢిల్లీలో కరోనా విజృంభణ

దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 11వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలో 11, 486 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 14802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 45 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు వదిలారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 16.36% శాతంగా ఉంది. 

మరోవైపు  దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం ల‌క్ష‌ల్లో  పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజు రోజుకు క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వ‌రుస‌గా మూడో రోజు కూడా 3 ల‌క్ష‌ల‌కు పైగానే కొత్త కేసులు న‌మోదయ్యాయి.. కానీ, నిన్న‌టి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు త‌గ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దేశంలో 3,37,704 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 

మరో 488 మంది మరణించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసులు 9,550 తక్కువగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17.22 శాతం పాజిటివిటీ రేటు ఉందన్నారు అధికారులు.