ప్రస్తుత సమాజం, విద్యావ్యవస్థలో విద్యార్థుల్లో ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది.విద్యా వ్యవస్థ, కొత్త టెక్నాలజీ, విద్యార్థుల్లో పోటీ, మార్కులు, పరీక్షలు, విజయాలు ఇవే ముఖ్యం అంటూ పేరెంట్స్.. వారి ఆరోగ్యం, సంతోషం, భావోద్వేగాలను పట్టించుకోవడం లేదు.. ఇవన్నీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
పాఠశాలల్లో విద్యార్థుల మెంటల్ హెల్త్ చెకప్ తప్పని సరి చేసింది ఢిల్లీ ప్రభుత్వం. భవిష్యత్ తరాల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ ప్రకటించింది..జాతీయ విద్యావిధానం 2020 కి అనుగుణంగా పాఠశాలలు, విద్యార్థుల పేరెంట్స్ కలిసి నియమాలను రూపొందించి ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. CBSE నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తున్నాయో లేదో దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.
ఢిల్లీలోని సెయింట్ కొలంబా స్కూల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య కేసు తర్వాత..అన్ని పాఠశాలల్లో విద్యార్థుల మానసిక -ఆరోగ్య పద్ధతులను సమగ్రంగా సమీక్షించాలని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు లేఖలు రాయడం ప్రారంభించింది.
విద్యార్థుల మానిసక ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు పాఠశాలలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది.. తర్వాతి తరం మానిసికంగా ఆరోగ్యంగా ఉండేలా వారు బాధల్లో పడకుండా చూసుకోవడం మా మా బాధ్యత అంటూ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ అన్నారు.
