ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 169 రన్స్

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 169 రన్స్

ఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై 169  పరుగుల టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్  ముందుంచింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది ముంబై.

మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి మంచి ఆరంభమే దక్కింది. కానీ రోహిత్ 30 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్ లో ఔటవ్వడంతో  ముంబై స్కోరు వేగం తగ్గింది. ఇక వరుస మ్యాచ్ లలో రాణిస్తున్న డీకాక్ రన్ ఔటయి నిరాశపరిచాడు. చివర్లో హార్థిక్ పాండ్య 15బంతుల్లో  3 సిక్స్ లు, 2 ఫోర్లతో 32 పరుగులలతో మెరవడంతో ముంబైకి 168 స్కోర్ చేయగల్గింది.

ముంబై బ్యాటింగ్ రోహిత్ శర్మ30, డీకాక్ 35, బెన్ కటింగ్ 2, సూర్యకుమార్ యాదవ్ 26, కృనాల్ పాండ్య 37,హార్థిక్ పాండ్య32 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు  రబాడకు 2 వికెట్లు, అమిత్ మిశ్రా,అక్షర్ పటేల్ కు తలో ఒక వికెట్ పడ్డాయి.