
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆక్సిజన్‌ను అందించే దిశగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం delhigov.in వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వెబ్‌సైట్ కింద ఆస్పత్రి పడకలు, ఈ-పాస్‌లు, ఆక్సిజన్ రీఫిల్ బుకింగ్‌ను సర్కార్ అందుబాటులో ఉంచింది. ఈ వెబ్‌సైట్‌లో కరోనా నిర్ధారణను చూపే పాజిటివ్ రిపోర్ట్, ఆధార్ కార్డు, ఫొటో ఐడీ అప్‌లోడ్ చేస్తే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి నేరుగా వారి ఇళ్లకు ఆక్సిజన్ అందిస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఇప్పటికే కేజ్రీవాల్ సర్కార్ వైద్య సదుపాయాలను అందిస్తోంది. ఆక్సీ మీటర్లు, వైద్యులతో ట్రీట్మెంట్ అందిస్తోంది.