నింబోలి అడ్డ హాస్టల్ను  అంబేద్కర్ భవన్గా ప్రకటించాలి..మాల సంక్షేమ సంఘం డిమాండ్

నింబోలి అడ్డ హాస్టల్ను  అంబేద్కర్ భవన్గా ప్రకటించాలి..మాల సంక్షేమ సంఘం డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: కాచిగూడలోని నింబోలి అడ్డ హాస్టల్​ను బాబు జగ్జీవన్ రామ్ స్మారక భవన్​గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తెలిపారు. ఆదివారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. ఈ హాస్టల్​కు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తో చారిత్రక సంబంధం ఉందని, అందుకే దీనిని అంబేద్కర్ స్మారక భవన్​గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.