డెంగీ, మలేరియాను ఆరోగ్యశ్రీ పరిధిలో తేవాలె: జీవన్​రెడ్డి

డెంగీ, మలేరియాను ఆరోగ్యశ్రీ పరిధిలో తేవాలె: జీవన్​రెడ్డి

రాయికల్,​ వెలుగు: డెంగీ, మలేరియా వ్యాధులతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని, వీటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లయితే బడుగు బలహీనవర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. రాయికల్​ పట్టణంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్​ భగీరథ నీటిని మళ్లీ ట్యాంకులకు ఎక్కించడంతో క్లోరినేషన్​ లేకుండానే ప్రజలకు చేరుతున్నాయని, దాంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. రాయికల్​ పట్టణ పరిధిలో ఇటీవల డెంగీ జ్వరాలతో కొందరు చనిపోయారని, పారిశుద్ధ్యంపై మున్సిపాలిటీ అధికారులకు పట్టింపు కొరవడిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాయికల్​లో నల్లా నీళ్లు చేరని ప్రాంతాల్లో బోర్లను వేయించి 20 కనెక్షన్లను ఏర్పాటు చేశానని, మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండానే వాటికి కరెంట్​తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంటనే ఆ బోర్లకు కరెంటు కనెక్షన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Dengue, malaria should be brought under the purview of Aarogya sri : Jeevan Reddy