ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు అఫీసర్లు

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు అఫీసర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో వాలంటీర్లను నియమించేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో వార్డు అఫీసర్లను నియమిస్తామన్నారు మంత్రి కేటీఆర్. వారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారన్నారు. ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్..అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మెదటి సారిగా వార్డుకు ఒక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందన్నారు. ఖాళీల భర్తీ ద్వారా పట్టణ ప్రగతి మరింత వేగంగా ముందుకు దూస్కెళ్తుందన్నారు. పౌరుడే కేంద్రంగా పౌర సేవలను ప్రజలకు వేగంగా అందించేందుకు, పట్టణాల క్రమానుగత అభివృద్ధికి ఖాళీల భర్తీ ఎంతో దోహదం చేస్తుందన్నారు. నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశముందన్నారు మంత్రి కేటీఆర్.