అది ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం.. ఆపరేషన్ సిందూర్పై ఇండియన్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు

అది ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం.. ఆపరేషన్ సిందూర్పై ఇండియన్ ఆర్మీ సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్ ముగిసిన రెండు నెలల తర్వతా ఇండియన్ ఆర్మీ సంచలన విషయాలు వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ వెనుక ఉన్న కీలక అంశాలను ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని 9 క్యాంపులను టార్గెట్ చేయాలనే నిర్ణయం చివర్లో తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. 

ఆపరేష్ సిందూర్ ప్రారంభించే ముందు చివరి గంటలో టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 21 క్యాంపులను గుర్తించగా.. అందులో 9 క్యాంపులను కీలకమైనవిగా ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

పాక్ కు పెద్ద గుణపాఠం:

ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ కు పెద్ద గుణపాఠం చెప్పాం. ఇండియాతో పాక్ ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వినా ఇండియన్ ఆర్మీ పైచేయి ఉండేలా చర్యలు తీసుకున్నాం. తీసుకుంటాం కూడా. పాక్ ను ఎంతలా దెబ్బ కొడతామో వాళ్లు ముందే ఊహించలేనంత దాడికి దిగుతాం.. ఆపరేషన్ సిందూర్ లో అదే జరిగింది.

పాకిస్తాన్ ఎందుకు కాల్పుల విరమణ కోరింది:

పాక్ ఇండియన్ ఆర్మీ సహనాన్ని పరీక్షిస్తూ వచ్చింది.. అతి పెద్ద పంచ్ ఇచ్చేందుకు తాము సిద్ధం అయ్యాం. అమ్ముల పొదిలి నుంచి అతిపెద్ద అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లు ముందే గ్రహించిన పాక్.. సీజ్ ఫైర్ కు మోకరిల్లింది.  సీజ్ ఫైర్ కు ఒప్పుకోకుంటే పాక్ కు తీవ్ర నష్టపోయేది.

9 లక్ష్యాల ఎంపిక:

టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సహకారంతో చాలా డాటా సేకరించాం. దీని ఆధారంగా 9 లక్ష్యాలను ఎంచుకున్నాం. వాస్తవానికి మొత్తం 21 లక్ష్యాలను ఎంచుకోగా.. చివర్లో 9 కీలక టార్గెట్లను ధ్వంసం చేయాలని డిసైడ్ అయ్యాం. చివరి రోజు, చివరి గంటలో ఈ నిర్ణయం తీసుకున్నాం. 

ఇది ఇండియా మాస్టర్ స్ట్రోక్:

యుద్ధం మొదలు పెట్టడం సులభం. ముగించడం కష్టం. కానీ మాస్టర్ మేము ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో పాక్ మోకరిల్లింది. సరైన సమయంలో యుద్ధం ఆపేలా వ్యూహాత్మకంగా ఇండియా వ్యవహరించింది.

ALSO READ : పాక్‎కు చైనా సహయం చేసింది..

చైనా, టర్కీ పాక్ కు సపోర్ట్ చేశాయి:

ఇండియా-పాక్ యుద్ధంలో చైనా తో పాటు టర్కీ కూడా పాకిస్తాన్ కు సహాయం చేసింది. పాక్ ముందుండగా.. చైనా వెనకుండి యుద్ధాన్ని నడిపించింది. పాక్ ను రెచ్చగొట్టడంలో చైనా ఉందన్న విషయం ముందే తెలుసు. అందులో ఆశ్చర్యం లేదు. గత ఐదేళ్లలో 81 శాతం రక్షణ ఆయుధాలు పాకిస్తాన్ కు చైనా నుంచే వచ్చాయి. పాక్ ను చైనా ఒక ప్రయోగశాలగా వాడుకుంటోంది. అక్కడ ఆయుధాలను పరీక్షిస్తోంది.