ఫార్ములా - ఈ రేస్ దండగ.. కోరికలు తీర్చుకునేందుకు రాష్ట్రం తాకట్టా?: భట్టి

ఫార్ములా - ఈ రేస్  దండగ.. కోరికలు తీర్చుకునేందుకు రాష్ట్రం తాకట్టా?: భట్టి
  • ఒక కంపెనీకి లబ్ధి కోసమే అడ్డగోలు అగ్రిమెంట్లు
  • బిజినెస్ రూల్స్ అతిక్రమించి ఒప్పందాలు
  • కోరికలు తీర్చుకునేందుకు రాష్ట్రం తాకట్టా?
  • పోటీల రద్దుపై ట్విటర్ లో మాజీ మంత్రి పోస్టా?
  • మీ బాధంతా రాష్ట్ర బాధ ఎలా అవుతుంది
  • ఫార్ములా ఈ రేసింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: ఫార్ములా – ఈ దండగ కార్యక్రమమమని, ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్లు జరిగాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ట్రై పార్టీ అగ్రిమెంటు పూర్తిగా లోప భూ ఇష్టంగా ఉందన్నారు.  సెక్రటేరియట్ అగ్రిమెంట్లకు విరుద్ధంగా రూ. 55 కోట్లు విడుదల చేశారని, ఫోన్ లో మంత్రి చెబితే డబ్బులు విడుదల చేసినట్టు స్పెషల్ సెక్రటరీ వివరణ ఇచ్చారని అన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా, మంత్రి సంతకం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా రిలీజ్ చేశారని ఆయన ప్రశ్నించారు.   తాము గత ప్రభుత్వ లోపాలను సరిచేసే పనిలో పడ్డామని వెల్లడించారు. 

హైదరాబాద్‌లో ఫార్మూలా ఈ-ఫ్రిక్స్ ఈవెంట్ రద్దుపై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలని, ఫార్ములా ఈ-రేసుపై ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే, అలా చేయడం వల్ల ఈవెంట్‌తో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా, ప్రభుత్వమే అదనంగా ఖర్చును భరించాల్సిన పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క చెప్పారు. ఈ వెంట్ నిర్వహణకు 110 కోట్లకు గత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందన్నారు. రూ. 55 కోట్లను వాళ్లకు కట్టేశారని, మిగతా డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సదరు కంపెనీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రానికి పైసా ఆదాయం వచ్చే అవకాశమే లేకున్నా తమ సరదాలు, కోర్కెలు తీర్చడం కోసం ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారని చెప్పారు. వాళ్ల కోర్కెతు తీర్చడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.