తెలంగాణ కల్చర్ ప్రతిబింబించేలా కాకతీయం గ్రంథం : మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ కల్చర్ ప్రతిబింబించేలా కాకతీయం గ్రంథం :  మల్లు భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

బషీర్​బాగ్​, వెలుగు: ప్రముఖ నాట్యగురు, పద్మశ్రీ డాక్టర్​ జి.పద్మజారెడ్డి రచించిన కాకతీయం గ్రంథం తెలంగాణ కల్చర్​ను ప్రతిబింబించేలా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఆ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ నాట్య సాంప్రదాయాన్ని శాస్త్రీయంగా వెలికితీశారని రచయిత పద్మజారెడ్డిని అభినందించారు.

 టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజారెడ్డి శిష్యబృందం ప్రదర్శించిన శాస్త్రీయ పాద విన్యాసాలు, హస్తముద్రలు, కరణాల డెమో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.