యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. 20 నుంచి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్, సీఎస్ శాంతి కుమారి ఇరత ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరాకు ముందే.. అక్టోబర్ 11న యంగ్ ఇండియా స్కూల్స్ కు భూమి పూజ చేస్తామని వివరించారు. ప్రతి సెగ్మెంట్లో ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూ్ళ్లకు కూడా భారీగా నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా యంగ్ ఇండియా స్కూల్ కడతామని అన్నారు. పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా స్కూల్స్ లో విద్య ప్రమాణాలు ఉంటాయని ఆయన అన్నారు. మూడు నెలలుగా యంగ్ ఇండియా స్కూళ్లపై చాలా ఆలోచనలు జరిపామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో1000పైగా ఉన్న పాఠశాలలో 600 స్కూల్స్ లకు సొంత భవనాలు లేవన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పై రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.