టీచర్ నిత్య విద్యార్థిగా ఉండాలి : డీకే శివకుమార్

టీచర్ నిత్య విద్యార్థిగా ఉండాలి  : డీకే శివకుమార్

సికింద్రాబాద్​ , వెలుగు :  విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసి, భవిష్యత్​కు దోహదపడేలా తీర్చిదిద్దాలని  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​పేర్కొన్నారు. టీచర్ నిత్య విద్యార్థిగా ఉంటూ తను నేర్చుకున్న  విషయాలను, నైపుణ్యాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. హబ్సిగూడలో కొత్తగా నిర్మించిన కౌన్సిల్​ఫర్​ద ఇండియన్​స్కూల్​సర్టిఫికెట్ఎగ్జామినేషన్​ బిల్డింగ్ ను సోమవారం డిప్యూటీ సీఎం శివకుమార్​ ప్రారంభించారు. 

అనంతరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన తర్వాత మాట్లాడారు. అంతకు ముందు ఉదయం సెంటర్​లో వివిధ స్కూళ్ల టీచర్లు, కరస్పాండెంట్లకు  ప్రత్యేక సదస్సు నిర్వహించారు.  కార్యక్రమంలో పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సెయింట్​ జోసెఫ్​ స్కూల్​ చైర్మన్​ జె. ఇమ్మాన్యుయేల్ ​, ఉప్పల్​ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, వివిధ స్కూళ్ల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.