
హైదరాబాద్ సిటీ, వెలుగు: తార్నాక డివిజన్‌లో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి తెలిపారు. ఆమె టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి డివిజన్‌లో పర్యటించారు. వినోభా నగర్ శ్మశాన వాటిక బ్యూటిఫికేషన్, లాలాపేట రోడ్డుకు విస్తరణ పనులను పరిశీలించారు.
వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో తార్నాక డివిజన్ ముందుండాలన్నారు. డిప్యూటీ మేయర్వెంట జీహెచ్ఎంసీ అధికారులు సువర్ణ, వేణు, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ లాల్, మంత్రి ప్రవీణ్, సుభాష్, అనిల్ తదితరులు ఉన్నారు.