వివేక్​తోనే చెన్నూరు అభివృద్ధి .. బాల్క సుమన్​ను​ తరిమికొట్టాలి: నల్లాల ఓదెలు

వివేక్​తోనే చెన్నూరు అభివృద్ధి .. బాల్క సుమన్​ను​ తరిమికొట్టాలి: నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు : చెన్నూరు అభివృద్ధి వివేక్​ వెంకటస్వామితోనే సాధ్యమని, ఆయనను భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలో చెన్నూరు  నియోజకవర్గ కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి నివాసంలో పలు మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలకు చెందిన బీఆర్​ఎస్, బీజేపీ లీడర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరారు. వారికి వివేక్​ వెంకటస్వామి,  నల్లాల ఓదెలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఓదెలు మాట్లాడుతూ.. వివేక్​వెంకటస్వామిని గెలిపిస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకుంటారని, బాల్క సుమన్ కు ఓటేస్తే జనం నెత్తిమీద కూర్చుని పెత్తనం చేస్తాడని అన్నారు. చెన్నూరు నుంచి బాల్క సుమన్ ను తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ బాల్క సుమన్​ వేల కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించారు. బాల్క సుమన్​అరాచకాలు పోవాలంటే వివేక్ వెంకటస్వామిని గెలిపించుకోవాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాల్క సుమన్ లో వణుకు చూశానని, మళ్లీ ఇప్పుడు వివేక్​ అన్న రాకతో బాల్క సుమన్ లో భయం చూస్తున్నానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్  ఆరు గ్యారెంటీలతో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. 

కాంగ్రెస్ లోకి బీజేపీ మండల ప్రెసిడెంట్, లీడర్లు

చెన్నూరు నియోజకవర్గం మందమర్రి, రూరల్ బీజేపీ ప్రెసిడెంట్ పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో 100 మంది లీడర్లు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడికి చెందిన బీఆర్​ఎస్ ​లీడర్లు బుస్స సదానందం, కూనారపు శివకుమార్, ఊటూరి చంద్రయ్య, పందిరి లింగయ్య ఆధ్వర్యంలో యువకులు కాంగ్రెస్​లో చేరారు. 

కాంగ్రెస్ జనరల్  సెక్రటరీ రిక్కుల శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో జైపూర్  మండలానికి చెందిన ఉప సర్పంచి అంబాల సంపత్​రెడ్డి, వార్డు మెంబర్లు ఇరిగెరాల శ్రవణ్​​కుమార్, గద్దెల మల్లేశ్, కట్కూరి సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్, అనిల్​తోపాటు పలువురు కాంగ్రెస్ ​పార్టీలో చేరారు. మందమర్రి మండలం వెంకటాపూర్​గ్రామానికి చెందిన అగ్గు శ్రీకాంత్, వెల్పుల చిరంజీవి, శ్రీనివాస్ తోపాటు పలువురు యువకులు వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. నస్పూర్​ మండలం ఆర్కే6 రాజీవ్​నగర్​కు చెందిన బీఆర్​ఎస్​ లీడర్లు బొగ్గు ప్రభాకర్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.