
నిజమాబాద్- జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. నిజమాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె…బీజేపీ, కాంగ్రెస్ లతో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. ఈసారి జరిగే సాదారణ ఎన్నికల్లో అటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాల్లేవని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో TRS ఎంపీలను గెలిపించాలన్నారు. ఢిల్లీలో మన వాయిస్ ను వినిపించేలా అవకాశం కల్పిస్తే మన సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని లక్షలాది మంది తరలివచ్చి..విజయవంతం చేయాలని కోరారు ఎంపీ కవిత.