
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి . అభివృద్ధి ,సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ప్రతి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి అవినీతి లేని వ్యవస్థ ను తీసుకువస్తామని అన్నారు. పండించిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇల్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.