రాచకొండ కమిషనర్గా డీఎస్‌ చౌహాన్‌ బాధ్యతలు

 రాచకొండ కమిషనర్గా డీఎస్‌ చౌహాన్‌ బాధ్యతలు

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ (డీఎస్‌ చౌహాన్‌) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది అభినందనలు చెప్పారు. రాచకొండ కమిషనరేట్‌ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్‌గా కొనసాగిన మహేశ్‌ భగవత్‌  సీఐడీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో డీఎస్‌ చౌహాన్‌ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997వ బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ గతంలో ఎక్సైజ్‌, కేంద్ర సంస్థలతో పాటు పలు జిల్లాల్లో పనిచేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన చౌహాన్‌ ఎంటెక్‌ పూర్తి చేశారు. 

2016 నుంచి సుధీర్ఘ కాలంగా  రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా  మహేశ్‌ భగవత్‌ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఒక  పోలీస్ కమిషనరేట్‌ కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి మహేశ్‌ భగవత్‌ రికార్టు సృష్టించారు. 1995 బ్యాచ్‌ కు చెందిన ఆయన మహిళల అక్రమ రవాణా అరి కట్టడానికి తీసుకున్న చర్యలను గానూ అమెరికా ప్రభుత్వం 2017లో ‘హీరో’ అవార్డుతో సత్కరించింది.