నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు షురూ

నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు షురూ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు షురూ కానున్నాయి. కొండపైన ఉన్న శ్రీపర్వత వర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరిపే ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 11.45 గంటలకు విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. రూ.1,116 చెల్లించిన దంపతులకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.  

వేములవాడలో..

వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబైంది. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం భక్తులకు రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో పాటు, రాత్రి ఉత్సవ విగ్రహాలను ఆలయంలో పల్లకీపై ప్రదక్షిణలు చేయిస్తారు. సోమవారం శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం హంస వాహనంపై ఊరేగిస్తారు. నవరాత్రుల నేపథ్యంలో అక్టోబర్​5 వరకు ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణం రద్దు చేశారు.