నా వల్ల టీడీపీకే లాభం తప్ప.. నాకు ఒరిగిందేమి లేదు

నా వల్ల టీడీపీకే లాభం తప్ప.. నాకు ఒరిగిందేమి లేదు

తన వల్ల టీడీపీకే లాభం జరిగింది తప్ప పార్టీ వల్ల తనకెలాంటి ఉపయోగం జరగలేదన్నారు దేవినేని అవినాశ్. వైసీపీలో చేరిన అవినాశ్ మీడియాతో మాట్లాడారు.  టిడిపిలో ఉన్నప్పుడు తానెలాంటి భూకబ్జాలు చేయలేదన్నారు. తనపై ఎటువంటి నేరారోపణలు లేవని..తానెవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను కార్యకర్తల అభిమానాన్ని సంపాదించుకున్నానే తప్ప డబ్బు సంపాదించలేదన్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ పై నమ్మకంతోనే  వైసీపీలో చేరానన్నారు.

జగన్ తనకు తూర్పు నియోజకవర్గ భాద్యతలు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్దానిక సంస్దల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల  గెలుపుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు వెళతామన్నారు.