V6 News

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు.