భక్తులతో కిక్కిరిసిన మేడారం గద్దెల ప్రాంగణం

భక్తులతో కిక్కిరిసిన మేడారం గద్దెల ప్రాంగణం

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం నుంచి వరుస సెలవులు రావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర సమీస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సమ్మక్క సారలమ్మ పసుపు, కుంకుమ చీరెసారె, నిలువెత్తు బంగారం( బెల్లం) తో మొక్కులు సమర్పించుకున్నారు. 

ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసీ మహా సమ్మేళనం సమ్మక్క  సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. తాజాగా మేడారం జాతర 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వహించనున్నారు.