తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల దర్శనానికి రోజు రోజకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రోజుకు దాదాపు 78 వేలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు.   వేసవి సెలవులు ముగుస్తుండటంతో దర్శనానికి భక్తులు ఎగబడుతున్నారు.  తిరుమల సర్వదర్శనానికి  22 గంటల సమయం పడుతోంది.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సాధారణ భక్తుల కోసం ఎక్కువ దర్శన వేళలను అందించడానికి టీటీడీ అధికారులు పెద్ద మార్పులు చేశారు. VIP సిఫార్సు లేఖలను రద్దు చేశారు  అధికారులు.  ఇది ఒక గంట వరకు ఆదా అవుతుంది. 

జులై, ఆగస్టుకు సంబంధించి వసతి కోటాతో సహా రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను మే 24న టీటీడీ విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని, నకిలీ టీటీడీ వెబ్‌సైట్ల బారిన పడవద్దని అధికారులు సూచించారు.