సర్వదర్శనానికి 14 గంటల సమయం

 సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. కాగా శనివారం 76,736 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. 34,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీడీకి 3.63 కోట్లు ఆదాయం వచ్చినట్టుగా  ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి.  తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.