తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

నాలుగోరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష సేవలు, రాత్రి హనుమంత వాహన సేవలు నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు భక్తుల రద్దీ తగ్గింది.  శ్రీవారిని దర్శించుకునేందుకు.. భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనానికి మూడు గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు.

ఆదివారం74,807మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. 21,974మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామి హుండీ  ఆదాయం 3.58కోట్లు వచ్చినట్లు టిటిడి పేర్కొంది.

Also Read :- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి