ఆధ్యాత్మికం: ఉగాది  పండుగ..   వేదాలు.. మంత్రాలు..  విశ్వ సృష్టి జరిగిన రోజు ఇదే..!

ఆధ్యాత్మికం: ఉగాది  పండుగ..   వేదాలు.. మంత్రాలు..  విశ్వ సృష్టి జరిగిన రోజు ఇదే..!

స్వశ్రీ చంద్రమానేన పరాభవ నామ సంవత్సర చైత్రమాసం ఉత్తరాయణం వసంత రుతువు శుక్ల పాడ్యమి గురువారం  ఈ ఏడాది (2026) మార్చి 19 న ఉగాది వచ్చింది. అనాదిగా వస్తున్న  ఉగాది పండుగ  ...యుగాది.. అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజును.. .  కాలం అడుగు పెట్టిన రోజుగా.. ఉగాది పండుగగా, కొత్త సంవత్సరాదిగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకొనే పండుగ ఉగాది. ఇది తెలుగువారి కొత్త సంవత్సరం. ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఉగాది' అనే మాట పుట్టిందని కొందరు చెబుతున్నారు. ఉగ అంటే నక్షత్రాల సమూహమని, వాటి సంచారం మొదలవుతుంది కనుక ఉగాది అయిందని చెప్తారు. జన్న, ఆయుష్షు అనే అర్ధాలు ఉన్నాయి. ఉగ (నక్షత్ర గమనానికి) ఆది (మొదలు) కాబట్టి, ఉగాది అంటారు. 

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. తెలుగు వారితో పాటు కర్ణాటకలలోనూ ఉగాది వేడుకలు జరుపుకుంటారు. 2026 మార్చి 19 గురువారం  నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం అందరికీ సిరి సంపదలు, సకల శుభాలు కలిగించాలని ఉగాది వేడుకల్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.

సోమకుడు అనే రాక్షసుడు వేదాలను "దొంగిలించి, సముద్రంలో దాక్కున్నాడని, విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి, ఆ రాక్షసుడ్ని సంహరించి, వేదాలను తెచ్చి బ్రహ్మ దేవుడికి ఇచ్చిన రోజు కూడా ఇదే అని నమ్ముతారు. రుతువులన్నింటిలోకి విశిష్టమైనది వసంత రుతువు. అది కూడా ఆ రోజు నుంచే మొదలవుతుంది. ఏకాక్షర నిఘంటువు ప్రకారం తెలుగులో నక్షత్రాలను ఉరు అంటారు. అందుకే ఏకాక్షరం 'ఉ'ని వాడారు. అలాగే 'గ' అంటే గణము (సమూహం). ఈ రెండు ఏకాక్షరాలను కలిపి, ఆరంభానికి గుర్తుగా ఆది'ని కూడా కలిపితే 'ఉగాది' అయిందని అంటారు. 

పండుగ రోజు ఏం చేయాలి.

తెలుగు లోగిళ్లు అన్నీ ఉగాది పండుగ రోజు కొత్త కళ సంతరించుకుంటాయి. ప్రతి ఇంటిని
శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. ప్రతి గడపకు పూలదండలు. మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇంట్లో తమ ఇష్టదైవానికి పూజ చేసి, పిండి వంటలు నైవేద్యంగా పెడతారు.

ప్రత్యేకంగా ఆ రోజు 'ఉగాది పచ్చడి' చేసుకోవడం ఆనవాయితీ. అలాగే భక్ష్యాలు బూరెలు వంటి సంప్రదాయ తీపి వంటకాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉగాది పచ్చడి... పిండి వంటలు తిని సంతోషంగా గడుపుతారు. ఆ రోజు తీసుకునే ఉగాది పచ్చడిలో వాడే పదార్ధాలు వాత, కఫ దోషాల్ని తొలగిస్తాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం చేయడం కూడా మంచిదని నమ్ముతారు. ఆ రోజు నుంచే వసంత నవరాత్రులు మొదలవుతాయి. తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు.