నులిపురుగుల మాత్రలు వికటించాయంటూ పేరెంట్స్ ఆందోళన

నులిపురుగుల మాత్రలు వికటించాయంటూ పేరెంట్స్ ఆందోళన
  • వికటించాయంటూ పేరెంట్స్ ఆందోళన
  • బోయిన్​పల్లి మౌంట్ కార్మెన్ స్కూల్​లో నలుగురు స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు

కంటోన్మెంట్, వెలుగు: బోయిన్ పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్​లో పిల్లలకు వేసిన నులి పురుగు మాత్రలు వికటించాయని పేరెంట్స్ గురువారం ఆందోళనకు దిగారు. పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్ సీమ తెలిపిన వివరాల ప్రకారం..  జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా  హెల్త్​ సెంటర్ ఆధ్వర్యంలో బోయిన్​పల్లిలోని మౌంట్ కార్మెల్ స్కూల్​లో  పిల్లలకు మాత్రలు వేశారు. కొద్దిసేపటికి నలుగురు స్టూడెంట్లు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్​ స్కూల్​ ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయమై మెడికల్​ ఆఫీసర్​ సీమ  తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పటికే  30 స్కూళ్లలో 900 మందికి మాత్రలు వేశామన్నారు. మాత్రలు వేసినప్పుడు కడుపులో నులిపురుగులు ఉన్న వారికి కడుపు నొప్పి, వాంతులు అవుతాయని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.