జైళ్లశాఖలోకి కొత్తగా 136 మంది వార్డర్లు

జైళ్లశాఖలోకి కొత్తగా 136 మంది వార్డర్లు

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమంటే చిన్న విషయం కాదన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా.  కొత్తగా ఎంపికైన 136 మంది వార్డర్లకి  చంచల్‌గూడ జైలు ఆవరణలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సౌమ్య మిశ్రా...నూతన వార్డర్లందరికీ విషెస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది చిన్న విషయం కాదు... సమాజంలో  సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం గర్వకారణమన్నారు. 

దేశంలో తెలంగాణ జైళ్ళ శాఖకు ఎంతో పేరు ఉందన్నారు మిశ్రా.  శిక్షణలో  వార్డర్లను  వజ్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. జైళ్ళకు వచ్చే ఖైదీలను కేవలం నేరస్తులుగానే కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తామన్నారు. ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే..  అందుకే వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఉండేందుకు శిక్షణ ఇస్తామన్నారు.  ఇప్పటికే రెండు బ్యాచ్ ల వార్డర్ల  శిక్షణ చేసి పంపించామన్నారు. ఇప్పుడు మూడో బ్యాచ్ శిక్షణకు వచ్చిందన్నారు. ఈ శిక్షణ వార్డర్లకు అందరికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందన్నారు.