యువ పోలీసులకు ఖాసీం ఆదర్శం : డీజీపీ అంజనీకుమార్‌‌‌‌

యువ పోలీసులకు ఖాసీం ఆదర్శం : డీజీపీ అంజనీకుమార్‌‌‌‌

16 మెడల్స్​ను పోలీస్ శాఖకు అందజేసిన రిటైర్డ్ ఆఫీసర్ ​ఖాసీం

గండిపేట, వెలుగు : యువ పోలీస్​అధికారులు ఫిట్​నెస్ కాపాడుకుంటూ క్రీడల్లో రాణించాలని, పోలీస్​శాఖకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని డీజీపీ అంజనీకుమార్‌‌‌‌ సూచించారు. రిటైర్డ్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్​మహ్మద్‌‌‌‌ ఖాసీం తన సర్వీసులో సాధించిన పలు గోల్డ్, సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను గురువారం పోలీస్‌‌‌‌ మ్యూజియంకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌‌‌‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ పాల్గొని మాట్లాడారు. ఖాసీం సమర్థంగా డ్యూటీ చేస్తూనే, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించడం గొప్ప విషయం అన్నారు.

యువ పోలీస్​అధికారులకు ఖాసీం ఆదర్శప్రాయుడని మెచ్చుకున్నారు. అనంతరం వివిధ పోటీల్లో తాను సాధించిన 16 మెడల్స్‌‌‌‌ను మహ్మద్‌‌‌‌ ఖాసీం పోలీస్‌‌‌‌ శాఖ మ్యూజియంకు అందజేశారు. 2000, సెప్టెంబర్‌‌‌‌లో పదవీ విరమణ పొందిన ఆయన ఆల్‌‌‌‌ ఇండియా పోలీస్‌‌‌‌ మీట్, ఆల్‌‌‌‌ ఇండియా ఓపెన్‌‌‌‌ అథ్లెటిక్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ షిప్, ఆల్‌‌‌‌ ఇండియా పోలీస్‌‌‌‌ గేమ్స్, ఏపీ స్పోర్ట్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీట్‌‌‌‌ లో పాల్గొని ఈ మెడల్స్​సాధించారు. పోలీస్‌‌‌‌ అకాడామీ డైరెక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌ శాండిల్య, అడిషనల్‌‌‌‌ డీజీపీలు అభిలాష్‌‌‌‌ బిస్త్, షికా గోయల్, ఎస్​కే జైన్, ఐజీ కమలహాసన్‌‌‌‌రెడ్డి సహా పలువురు పోలీస్​ఉన్నతాధికారులు  తదితరులు పాల్గొన్నారు.