పింక్, రెడ్ బుక్కులు ఉండవ్.. మాదంతా ఖాకీ బుక్.. చట్టం ప్రకారం ముందుకెళ్తం: డీజీపీ శివధర్ రెడ్డి

పింక్, రెడ్ బుక్కులు ఉండవ్.. మాదంతా ఖాకీ బుక్.. చట్టం ప్రకారం ముందుకెళ్తం: డీజీపీ శివధర్ రెడ్డి
  • హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు
  • స్థానిక సంస్థల ఎన్నికలే మా ముందున్న ఫస్ట్ టార్గెట్
  • డీజీపీగా బాధ్యతల స్వీకరణ


హైదరాబాద్, వెలుగు: పోలీసులకు పింక్ బుక్.. బ్లూ, రెడ్, వైట్ బుక్కులంటూ ఏవీ ఉండవని.. ఒక ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఐపీసీ, సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ బుక్స్​లోని చట్టాల ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడమే తమ ముందున్న మొదటి టార్గెట్ అన్నారు. డీజీపీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివధర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

‘‘రెండున్నర నెలల పాటు ఎన్నికలు కొనసాగుతాయి. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతాం. పోలీస్ శాఖలో 17 వేల పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లాయి. వీలైనంత త్వరలో ఉద్యోగాల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీట్స్ సహా బేసిక్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తూనే సీసీ టీవీ కెమెరాలు, టెక్నాలజీతో ఫ్యూజన్ పోలీసింగ్ నిర్వహిస్తాం. ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేస్తాం. ఈ వ్యవస్థలు గత రెండేండ్లుగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సిబ్బందిలో స్కిల్స్ పెంచడంతో పాటు కొత్త వెహికల్స్, ఇతర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు పూర్తి ఏర్పాట్లు చేస్తాం’’అని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.


మావోయిస్టుల సమస్య లేదు

రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య లేదని, కేవలం బార్డర్ ఏరియాల్లో కొద్దిగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు వాళ్లతో చర్చలు జరిపితే ఎలాంటి లాభం ఉండదని తెలిపారు. ‘‘మావోయిస్టులందరూ లొంగిపోవాలి. బయటికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు పోలిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగస్టు 15న స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు. 

దీన్ని  బట్టి మావోయిస్టుల సిద్ధాంతం ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లు నేను భావిస్తున్నాను. పోలీసులు వేధిస్తారని భయపడొద్దు. సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాతక్క సహా పలువురు కీలక నేతలు ఇప్పటికే లొంగిపోయారు’’అని శివధర్ రెడ్డి తెలిపారు. తనను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 

ఈ సమావేశంలో అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్  భగవత్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ, సీఎం రేవంత్​, సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామకృష్ణరావు, హోంశాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తాను డీజీపీ శివధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.